నల్లగొండ, జనవరి 22 (విజయక్రాంతి): గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కిలోన్నరకుపైగా గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండలో డీఎస్పీ శివరాంరెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు ఈ నెల 21న మిర్యాలగూడ రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టారు.
బైక్‌పై అనుమా చ్ వెళ్తున్న ముగ్గురు యువకులను తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. ఈ నెల 16న కలెక్టరేట్ ఎదుట నిలిపిన బైక్‌ను సైతం నిందితులు దొంగిలించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. పట్టుబడిన ముగ్గురిలో లింగగళ్ల పూర్ణచంద్, హరిజన్ మహేశ్ హైదరాబాద్‌లోని మియాపూర్ జనప్రియ అపార్ట్‌మెంట్‌కు చెందిన వారు కాగా.. కానుకుంట్ల జగదీశ్ నల్లగొండ బీటీఎస్‌కు చెందిన వాడని తెలిపారు.