వివరాలు వెల్లడించిన నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల
ఆదిలాబాద్, (నిర్మల్) జులై12 (విజయక్రాంతి): ఆ ముగ్గురూ జల్సాలకు అలవా టుపడ్డారు. వాటికి డబ్బు అవసరమై తప్పు డు మార్గం పట్టారు. జన సంచారం లేని ప్రదేశానికి జంటలను టార్గెట్ చేశారు. రా త్రిళ్లు ఒంటరిగా వెళుతున్న వ్యక్తులను తుపాకీతో అటకాయిస్తున్నారు. వారి నుంచి అంది నకాడికి దోచుకుంటున్నారు. చివరికి పోలీసులకు పట్టుబడి కటకటాల పాలయ్యారు. నిర్మల్‌లోని ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ డాక్టర్ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. నిర్మల్ టౌన్ ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బందితో కలిసి మంచిర్యాల చౌరస్తాలో వాహన తనిఖీలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వస్తూ, పోలీసులను చూసి పరారవుతున్నారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని ఆవేశ్ చౌస్, షేక్ మతీనుద్దీన్‌గా గుర్తించారు. వారి నుంచి డమ్మీ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరు తమ స్నేహితుడు షేక్ ఆదిల్‌తో కలిసి దారి దోపిడీకి పాల్పడుతున్నట్లు వెల్లడైంది. ఆదిల్ గతంలో హైదరాబాద్ లో ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద నకిలీ తుపాకీ కొనుగోలు చేసినట్లు తెలిసింది. సమావేశంలో డీఎస్పీ గంగారెడ్డి, నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్, రూరల్ సీఐ శ్రీనివాస్, హెడ్‌కానిస్టేబుల్ కిష్టు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.