14-03-2025 06:58:10 PM
77 విస్కీ క్వార్టర్స్ బాటిల్స్ స్వాధీనం
చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ బి. రాజు
ముషీరాబాద్,(విజయక్రాంతి): అక్రమంగా మద్యం విక్రయాలు చేపడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చిక్కడపల్లి పోలీసులు గురువారం తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు మూసివేయడంతో బ్లాక్లో మద్యం విక్రయాలు చేపట్టి లాభాలు పొందాలనే ఉద్దేశంతో బాగ్లింగంపల్లిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న జావీద్ ఖాన్ (అంబర్ పేట), సయ్యద్ సాజిద్ (అచ్చయ్య నగర్), వద్ద నుంచి 24 క్వార్టర్ బాటిల్స్ ( విస్కీ), మరొక వ్యక్తి కుమ్మరి శివకుమార్ (బాగ్లింగంపల్లి) నుండి 53 క్వార్టర్స్ బాటిల్స్ (విస్కీ) స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఇన్స్పెక్టర్ బి. రాజు వెల్లడించారు.