calender_icon.png 4 October, 2024 | 10:56 AM

మూడున్నర దశాబ్దాల నమ్మకం

04-10-2024 12:38:27 AM

సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలకు చిరునామాగా అపోలో ఆసుపత్రులు

కార్డియాలజీలో అత్యున్నత వైద్య సేవలు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 3 (విజయక్రాంతి): దేశంలోనే మొదటి కార్పొరేట్ ఆసుపత్రిగా 1983లో చెన్నైలో స్థాపితమై, 1988లో హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టి, నేడు అత్యుత్తమమైన వైద్యసేవలకు చిరునామాగా మా రాయి అపోలో ఆసుపత్రులు.

ప్రముఖ కార్డియాలజీ వైద్యుడు ప్రతాప్ సీ రెడ్డి స్థాపించిన అపోలో ఆసుపత్రులు నాణ్యమైన వైద్య సేవలకు చిరునామాగా నిలుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో 21 రాష్ట్రాలు, అమెరికా, ఒమన్, యూఏఈ దేశాల్లోనూ అపో లో ఆసుపత్రులు వైద్య సేవలు అందిస్తున్నా యి.

నగరంలోని జూబ్లీహిల్స్‌లో గల అపో లో హెల్త్ సిటీ సంవత్సరానికి లక్షమంది పేషెంట్లకు సేవలందిస్తూ వైద్య రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన ఆసుపత్రులుగా అపోలో నిలుస్తోంది. 2022లో దేశంలోని ఐదు అత్యుత్తమ ఆసుపత్రుల్లో అపోలో ప్రథమ స్థానంలో నిలిచింది. 

సంక్లిష్ట శస్త్ర చికిత్సలు..

తెలుగు రాష్ట్రాల్లోని అపోలో ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 1.5 లక్షలకు పైగా గుండె శస్త్రచికిత్సలు, 25 వేల కరోనరీ బైపాస్ సర్జరీలు జరిగాయి. వాటిలో 99 శాతం విజయవంతమయ్యాయి. ఏపీ, తెలంగాణలో రోబో సహాయక కార్డియాక్ సర్జరీ చేసిన మొదటి ఆసుపత్రి. మినిమల్లీ ఇన్వాసివ్ కార్డియాక్ సర్జరీలు 1300కు పైగా నిర్వహించారు.

ఏసియా ఠ పసిఫిక్ ఏరియాలో ట్రాన్స్ రేడియల్ ఆంజియో ప్లాస్టీలో లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మొదటిస్థానంలో నిలిచింది. హైదరాబాద్‌లో అత్యధిక జాయింట్ రీప్లేస్‌మెంట్ (హిప్, మోకాలు, భుజం) సర్జరీలు నిర్వహించింది. రొమ్ము క్యాన్సర్, మస్క్యులో స్కెలెటల్ క్యాన్సర్, బోన్ సార్కోమా క్లినిక్, థ్రోట్ క్యాన్సర్, గైనకాలజీ, అంకాలజీలో వైద్య సేవలందిస్తోంది.

దేశంలోనే మొదటి పెట్ స్కానర్‌ను కలిగిన ఆసుపత్రి. హైదరాబాద్‌లోనే ఉత్తమ క్యాన్స ర్ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. అవయవ మార్పిడికి అనువైన ఆసుపత్రిగా అపో లో నిలుస్తోంది. అందుకోసం అత్యుత్తమమైన సౌకర్యాలు, వైద్యు లు అందుబాటులో ఉన్నారు. 

అత్యుత్తమ వైద్యులు..

జూబ్లీహిల్స్‌లోని అపోలో హెల్త్ సిటీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. సరికొత్త సాంకేతికతను ఉపయోగిస్తూ సురక్షి తమైన చికిత్స అందిస్తున్నారు. ఇక్కడి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 477 పడకలు అందుబాటులో ఉన్నాయి. గుండె, ఎముకలు, కీళ్లు, వెన్నెముక, అవయవమార్పిడి, న్యూరాలజీ, క్యాన్సర్, ఆర్థోపెడిక్, గ్యాస్ట్రో, కొలెరెక్టల్, బేరియాట్రిక్, గైనకాలజీ, డయాలసిస్, ఆప్తల్మాలజీ, రీనల్ డిసీజెస్ వంటి వ్యాధులకు నాణ్యతతో కూడిన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.

అత్యుత్తమ వైద్యులు అందుబాటులో ఉండడంతో పాటు సంక్లిష్టమైన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తూ నాణ్యమైన వైద్యసేవలందిస్తున్నారు. హైదరాబాద్‌లోనే ఏకంగా 7 వేల మంది వైద్యు లు 56 విభాగాల్లో పని చేస్తున్నారు. ‘టచ్ ఎ బిలియన్ లైవ్స్’ అనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. 

అపోలో హాస్పిటల్స్‌కు చెందిన ఫార్మసీలు 21 రాష్ట్రాల్లో 3400 స్టోర్లు ఉన్నాయి. 150 పడకలతో ప్రారంభమైన అపోలో ఆసుపత్రికి చెందిన అన్ని బ్రాంచిల్లో  ప్రస్తుతం 9,200 పడకలు అందుబాటులో ఉన్నాయి.