calender_icon.png 14 November, 2024 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ రహదారికి మూడు ప్రత్యామ్నాయాలు

13-11-2024 12:58:44 AM

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ రఘునందన్‌రావు

  1. రైతుల ముందు ఆప్షన్స్ ఉంచిన మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
  2. సిద్ధిపేట కలెక్టరేట్‌లో అధికారులు, రైతులతో సమావేశం

కొండపాక, నవంబర్ 12: నూతన ప్రతిపాదిత సూర్యపేట జాతీయ రహదారి వలన ప్రభావితమౌతున్న సిద్దిపేట సమీపంలోని మర్పడగ, పరిసర గ్రామాల రైతులతో మంగళవారం కలెక్టర్ మనుచౌదరి, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, నేషనల్ హైవే అధికారులు సమావేశమయ్యారు. సిద్ధిపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రతిపాదిత రహదారి నిర్మాణ డీపీఆర్‌ను ఏజేన్సి ప్రతినిధి మురళి.. ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. దుద్దేడ నుంచి రామంచ వరకు గ్రామలమీదుగా వెళ్తున్న ప్రతిపాదిత రహదారికి సంబంధించి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున మూడు ప్రత్యామ్నాయ రహదారులను ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

* దుద్దేడ నుంచి రాజీవ్ రహదారి మీదు గా సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు జాతీయ రహదారిగా అబివృద్ధి చేస్తూ 756 రహదారికి కలపడం.

* రాజీవ్ రహదారి కంటే ముందు వేలికట్ట నుంచి బందారం మీదుగా సిద్దిపేట రీజనల్ రింగ్ రోడ్డు మీదుగా రామంచ వరకు.

* దుద్దేడ నుంచి తుక్కాపూర్, ఘనపూర్ మీదుగా ఇర్కొడ్ వరకు అక్కడ నుంచి 765 రహదారితో కలిసి రామంచ వర కు. వీటిలో ఏది రైతులకు అనుకూలం గా ఉంటే.. దానిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఎంపీ తెలిపారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, సిద్దిపేట ఆర్డీవో సదానందం, నేషనల్ హైవే ఈఈ బలరామకృష్ణ, సంబంధిత గ్రామాల రైతులు పాల్గొన్నారు.