22-02-2025 11:44:54 PM
రూ =.26 లక్షలు, మూడు సెల్ ఫోన్‌లు స్వాధీనం
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఓ ముఠా దొంగతనాలకు పాల్పడుతోందని, ఆ ముఠలోని కొందరిని శనివారం అరెస్టు చేసి వారి నుంచి రూ.26 లక్షల నగదును, మూడు సెల్ ఫోన్‌లను స్వాదీనం చేసుకొన్నట్లు పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్(Palvancha DSP Satish Kumar) వెల్లడించారు. శనివారం పాల్వంచ పట్ణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాజస్తాన్‌కు చెందిన నలుగురు వ్యక్తులు అశోక్, గణపతి,సునీల్, మనీష్ అనే నలుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వారిలో అశోక్ అనే అతను పాల్వంచ పట్టణంలో కిరాణ షాపులో పనిచేసేవాడు.
స్థానిక వ్యాపారులపై అవగాహన కలిగి ఉండటంతో వారి స్నేహితులకు సమాచారం అందించి వారితో పాటు ఒక వాహనం తీసుకొని జనవరి 3 వతేదీ తెల్లవారు జామున పట్టణంలోనిడిఎంఆర్ ఎంటర్ర్పైసె గోడౌన్‌లో రూ 27 లక్షల విలువైన సిగరేట్లు భారీ చోరికి పాల్పడుతారు. దొంగిలించిన సిగరేట్లను హైదరాబాద్‌లోని బోయినపల్లిలో వ్యాపారం చేనస్తున్న రాజసాన్‌కు చెందిన గణపతి ప్రజాపతికి విక్రయించారు. అశోక్, మనీష్ సరుకు కొనుగోలు చేసిన గణపతి ప్రజాపతిని నేడు అదుపులోకి తీసుకొని విచారించగా పూర్తి వివరాలు వెల్లడయ్యాయన్నారు. ఈ కేసులో మిగిలిన ఇద్దరు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. కేసును త్వరితగతిన చేధించిన పాల్వంచ సీఐ ను డీఎస్పీ అభినందించారు. ఈసమావేశంలో సీఐ సతీష్, పట్టణ రెండో ఎస్ ఐ రాఘవయ్య, సిబ్బంది పాల్గొన్నారు.