యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముంబై, నవంబర్ 3: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌కు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాట్సా ప్ ద్వారా ఓ యువతి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 10 రోజుల్లోనే యోగి తన యూపీ సీఎం పదవికి రాజీనామా చేయాలని, లేదా మాజీ మంత్రి బాబా సిద్ధిఖీని చంపినట్లే..
హతమారుస్తామంటూ ఓ నెంబర్ నుంచి ముంబై ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు మెసేజ్ వచ్చింది. అప్రమత్తమైన ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్, ఉల్హానగర్ పోలీసులు సంయుక్త ఆపరేషన్‌లో నిందితురాలిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేరానికి పాల్పడినది థానేకు చెందిన ఫాతి మాఖాన్(24)గా గుర్తించారు. డిగ్రీ చేసిన ఫాతిమా కొంతకాలంగా మానసిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కుంటోందని తెలుస్తోంది.