calender_icon.png 26 February, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పు ఇప్పించిన వ్యక్తికి బెదిరింపులు

26-02-2025 01:06:48 AM

  • మనస్తాపంతో జమానతుదారుడి ఆత్మహత్యాయత్నం

పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో

జనగామ, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): అప్పు ఇప్పించిన పాపానికి ఓ వ్యక్తి పరిస్థితి ప్రాణాలు తీసుకునే దాకా వెళ్లింది. రుణదాత, రుణ గ్రహీతల మధ్య జమానతు దారు డు నలిగిపోయాడు. ఓ వైపు రుణదాత అప్పు చెల్లించాలని ఒత్తిడి తేగా, మరో వైపు రుణ గ్రహీత అప్పు కట్టకుండా మొండికేయడంతో మధ్యవర్తి ప్రాణాల మీదికి వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన జమానతుదారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకెలితే.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కోట్ల నరేశ్ కొన్నేళ్ల క్రితం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం గుమ్మడవెల్లి గ్రామానికి చెందిన కుంచం నర్సయ్య, కుంచం వెంకటేశ్ సోదరులకు రూ.4 లక్షల అప్పు ఇచ్చారు. వీరికి జమానతుగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన కుంట రాజు ఉన్నా రు. అప్పు తీసుకున్న వారు మిత్తీ కూడా చెల్లించకపోవడంతో నరేశ్ జమానతుదారుడై నా రాజుపై ఒత్తిడి తెచ్చాడు.

దీంతో రాజు రూ.2 లక్షల అప్పు మిత్తీతో సహా చెల్లించాడు. తాను మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన అప్పు చెల్లించాలని రాజు కొన్ని సంవత్సరాలుగా నర్సయ్య, వెంకటేశ్‌ను వేడుకుంటున్నా వారు స్పందించడం లేదు. దీంతో జమానతుదారుడు రాజు సోమవారం గుమ్మడవెల్లికి వెళ్లి తీసుకున్న అప్పు చెల్లించాలని, రుణదాత ఊరుకోవడం లేదని చెప్పారు.

దీంతో అప్పు చెల్లించేది లేదని, తమను మరోసారి అప్పు అడిగితే చంపేస్తామని బెదిరించినట్లు రాజు వాపోయాడు. ఇదే విషయాన్ని సెల్ఫీ వీడియోలు చెబుతూ పురుగుల మందు తాగాడు. స్థానికులు హుటాహుటిన బాధితుడిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.