* రూ.50లక్షలు ఇవ్వకుంటే చంపేస్తాం
* ఠాణాలో నటుడి ఫిర్యాదు
ముంబై, నవంబర్ 7: ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుక్‌ఖాన్‌కు మంగళవారం ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇబ్బకుంటే చంపేస్తానని బెదిరించారు. ఈ మేరకు షారుక్‌ఖాన్ బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. కాల్ వచ్చిన నంబర్‌ను ట్రేస్ చేయగా ఫోన్‌కాల్ ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చినట్లు తెలిపారు. రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ ఖాన్ బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. అతడికోసం గాలిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో కూడా షారుక్‌కు బెదిరింపు కాల్స్ వచ్చా యి.
షారుక్ ఖాన్‌కు బెదిరింపు కాల్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయనకు వచ్చిన ఫోన్‌కాల్‌కు సంబ ంధించి ఫోన్ యజమాని.. ఆ కాల్ తను చేయలేదని, తన ఫోన్ దొంగలించబడిందని స్పష్టం చేశారు. తన ఫోన్ పోగొట్టుకున్న విషయంమై ఇప్పటికే రాయ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆయన స్పష్టం చేశారు. తన ఫోన్‌ను ఎవరో మిస్ యూజ్ చేశారని ఫైజాన్ ఖాన్ ఆరోపించారు. నవంబర్ ౨న ఫోన్ పోయిందని చెప్పారు.