ముంబై ట్రాఫిక్ పీఎస్‌కు గుర్తుతెలియని దుండగుల ఫోన్
ముంబై, నవంబర్ 8: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. ముంబై ట్రాఫి క్ పోలీసులకు గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఫోన్ చేసి.. బిష్ణోయ్ గ్యాంగ్ పేరుపై పాట పాడిన రచయితకు ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఉంటాయని.. సల్మాన్‌కు దమ్ముంటే వారిని రక్షించుకోవాలని హెచ్చరించారు. కాగా సల్మాన్‌కు వరు స బెదిరింపులు రావడంతో అతడి భద్రతను ప్రభుత్వం పెంచింది. ఇటీవల మరో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌కూ బెదిరింపు కాల్ వచ్చింది. రూ.50లక్షలు ఇవ్వకుంటే చంపేస్తా మని బెదిరించారు. మొత్తానికి బాలీవుడ్లో అగ్రనటులై ఇద్దరు ఖాన్లకు బెదిరింపులు రావడంతో హిందీ పరిశ్రమలో కలకలం రేగుతోంది.