calender_icon.png 11 January, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సల్మాన్‌కు మళ్లీ బెదిరింపులు

06-11-2024 01:47:05 AM

బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో ముంబై పోలీసులకు మెసేజ్

సల్మాన్ క్షమాపణ చెప్పాలి లేకుంటే రూ.5కోట్లు ఇవ్వాలని డిమాండ్

ముంబై, నవబంర్ 5: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దిఖీ హత్య తర్వాత బిష్ణోయ్ గ్యాంగ్.. సల్మాన్‌ను చంపేస్తామంటూ వరుస బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో తాజాగా సోమవారం అదే గ్యాంగ్ నుంచి సల్మాన్‌ను బెదిరిస్తూ ముంబై పోలీసులకు ఓ వాట్సాప్ మెసేజ్ వచ్చింది.

అందులో సల్మాన్‌కు దుండగులు రెండు ఆప్షన్స్ ఇచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ‘నేను లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిని. సల్మాన్‌ఖాన్ ప్రాణాలతో ఉండాలంటే అతడు ఆలయంలో బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి.. లేదంటే రూ.5కోట్లు ఇవ్వాలి. అలా జరగని పక్షంలో మేం అతడిని చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గానే ఉంది’ అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. 

వరుస బెదిరింపులతో భద్రత పెంపు

కాగా గతకొన్నిరోజులుగా అడిగన డబ్బులు ఇవ్వకుంటే సల్మాన్‌ను చంపేస్తామంటూ పోలీసులకు పలు మెసేజ్‌లు వచ్చిన విషయం తెలిసిందే. ఈ యేడాది ఏప్రిల్‌లో ముంబైలోని సల్మాన్ నివాసం ఎదుట దుండగలుఉ కాల్పులు కూడా జరిపారు. సల్మాన్ ఫాంహౌజ్‌లోకి సైతం చొరబడేందుకు కొందరు యత్నించారు.

ఈ ఘటనల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు భద్రత పెంచింది. కాగా గతనెలలో సల్మాన్‌కి అత్యంత సన్నిహితుడు, ఎన్సీ పీ నేత బాబా సిద్దీఖీని బిష్ణోయ్ గ్యాంగ్ అత్యంత దారుణంగా కాల్చి చంపిన విష యం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.