ప్రాణభయం ఉంది కాపాడండి.
పాల్వంచ, (విజయక్రాంతి): ఇచ్చిన అప్పు తిరిగి అడిగినందుకు కిరాయి గుండాలతో చంపిస్తానని ఫో బెదిరిస్తున్న ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రాణ భయం ఉందని ఓ వ్యక్తి పాల్వంచ సీఐని ఆశ్రయించాడు. మండల పరిధిలోని పాండాపురం గ్రామం చెందిన ఆడేపు దయాకర్ పాండురంగపురం కొత్తపేట గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాసరావుకు గత ఐదు సంవత్సరాల క్రితం కొంత నగదును అప్పుగా ఇచ్చాడు దీనికి శ్రీనివాస్ రావు గ్యారంటీగా ప్రాంసరీ నోటు చెక్కు ఇచ్చాడు.
ఎన్నిసార్లు అడిగినా అప్పు తిరిగి చెల్లించకపోవడంతో దయాకర్ రామ్ చరణ్ నోటు కోర్టులో వేశాడు అనంతరం పంచాయతీ గ్రామ పెద్దల వద్దకు చేరింది. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన దయాకర్ పనుల కోసం పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో శ్రీనివాసరావు పొలం వద్దనున్న దయాకర్ వద్దకు వెళ్లి నేను డబ్బులు ఇవ్వనందుకు కోర్టుకు వెళ్తావా అంటూ బూతులు తిడుతూ బెదిరించసాగాడు. కేసు విద్రాలు చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు. లేకుంటే నీ కుటుంబాన్ని కిరాయి గుండాలని పెట్టి చంపేస్తానని బెదిరించాడని భయభ్రాంతులకు గురి చేయడంతో బెదిరిస్తున్న చల్ల శ్రీనివాసరావుతో నాకు ప్రాణం ఉందని నాకు రక్షణ కల్పించాలని న్యాయం చేయాలని ఆడేపు దయాకర్ సిఐకి ఫిర్యాదు చేశారు.