- కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, రెమో, సుగంధ మిశ్రాలకు మెయిల్
- పోలీసులకు ఫిర్యాదు
న్యూఢిల్లీ, జనవరి 23: బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మతోపాటు రాజ్‌పాల్ యాదవ్, రెమో డిసౌజా, సుగంధ మిశ్రాకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని తాజాగా ముంబై పోలీసులు వెల్లడించారు. బిష్ణు అనే పేరుతో హత్య చేస్తామంటూ బాలీవుడ్ సెలబ్రెటీలకు మెయిల్ వచ్చినట్టు పేర్కొన్నారు.
మెయిల్ పంపిన వ్యక్తి తన డిమాండ్లను ఎనిమిది గంటల్లో నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు ఉం టాయంటూ సెలబ్రెటీలను బెదిరించినట్టు చెప్పారు. కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, రెమో, సుగంధ మిశ్రా ఇచ్చి న ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్నట్టు అంబో లీ, ఓషివారా ప్రాంతానికి చెందిన పోలీసులు వెల్లడించారు.
మొయిల్‌కు సంబంధించిన ఐపీ అడ్రస్ పాకిస్థాన్‌కు చెందింది గా ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. దీనిపై మరింత లోతుగా విచార ణ జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.