బాధితుడి ఖాతా నుంచి రూ.6.93 లక్షలు స్వాహా
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): మనీలాండ రింగ్‌కు పాల్పడినట్లు ఓ ప్రైవేట్ ఉద్యోగిని భయభ్రాం తులకు గురిచేసిన సైబర్ నేరగాళ్లు అతడి ఖాతాలో ఉన్న రూ.6.93 లక్షలను కాజేశారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి(28)కి డీహెచ్‌ఎల్ కొరియర్ ప్రతినిధులమంటూసైబర్ నేరగాళ్ల్లు ఫోన్ చేశారు.
మీ వివరాలతో కూడిన పార్సిల్ ముంబై నుంచి చైనాకు పంపిస్తున్నారని, అందులో నిషేధిత వస్తువులు ఉన్నాయని, పార్సిల్‌ను పోలీసులు పట్టుకున్నారని తెలి పాడు. ఇకమీదట ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని స్కామర్ సూచించాడు.
ఆ తర్వాత ముంబైలోని అధికారికి ఫోన్ బదిలీ చేస్తున్నానని చెప్పి పోలీసు వేషదారణలో ఉన్న సైబర్ క్రిమినల్‌కు కనెక్ట్ చేశాడు.మనీలాండరింగ్ కేసులో మీ పేరు, ఆధార్ నంబర్ ఉన్నాయని మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని వారెం ట్ పత్రాన్ని చూపించాడు.
దీంతో భయపడిన బాధితుడు స్కామర్లు చెప్పిన విధంగా విచారణకు సహకరిస్తానని తెలిపాడు. తన బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ. 6.93 లక్షలు వారి అకౌంట్‌కు బదిలీ చేశాడు. అనంతరం అవతలి వ్యక్తుల నుంచి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.