calender_icon.png 27 October, 2024 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనీలాండరింగ్ పేరుతో బెదిరింపులు

27-10-2024 12:46:36 AM

మహిళ నుంచి 3.12 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): మనీలాండ రింగ్ కేసు నమోదైందని ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేసి రూ. 3.12 లక్షలు కాజేశారు సైబర్ నేరగాడు.  నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఓ మహిళా ఉద్యోగికి ముంబాయి సైబర్ క్రైమ్ అధికారినంటూ వాట్సాప్ వీడియో కాల్ చేశాడు సైబర్ నేరగాడు ఆమె ఆధార్‌కార్డును గోవా, హర్యా నా, పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నారని, పిల్లల అక్రమ రవాణా, ఆర్థిక మోసాల వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఆధార్‌కార్డు వినియోగిస్తు న్నట్లు పేర్కొన్నారు.

ఈ క్రమంలో మీపై మనీలాండరింగ్ కేసు నమోదైందని, విచారణకు సహకరించాలని, లేకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరింపులకు గురిచేశాడు. విచారణ నిమిత్తం ఆమె బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తా న్ని ఆర్బీఐ నిబంధనల మేరకు తాను సూచించిన ఖాతాకు బదిలీ చేయాలని, విచారణ పూర్తయ్యాక తిరిగి చెల్లిస్తానని నమ్మించారు. దీంతో రూ. 3.12 లక్షలను బదిలీ చేసింది. అనంతరం అతడి నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడంతో సైబర్ నేరగాడి చేతిలో మోసపోయానని గ్రహించి శనివారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.