గృహ నిర్మాణదారుడి నుంచి 5 లక్షలు డిమాండ్
నిందితుడి అరెస్ట్
సంగారెడ్డి, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి)/ పటాన్‌చెరు: ఓ గృ నిర్మాణ దారుడిని రూ.5 లక్షలు డిమాండ్ చేసిన నకిలీ రిపోర్టర్‌ను అరెస్ట్ చేసినట్లు అమీన్‌పూర్ సీఐ నాగరాజు తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. అమీన్‌పూర్ మండలం బీరంగూడలోని జయలక్ష్మినగర్‌లో నివాసం ఉండే జన్వాడే రవి అనే వ్యక్తి సీబీఆర్ కాలనీలో జీ+2 ఇంటి నిర్మాణం చేపడుతున్నా డు. రామచంద్రాపురంలోని సాయినగర్ కాలనీకి చెందిన దగుడు రాము అనే వ్యక్తి నిర్మాణ స్థలానికి వచ్చి.. తాను ఓ పత్రికలలో రిపోర్టర్‌నని, ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తున్నారని భయభ్రాంతులకు గురి చేశాడు.
తనకు తహసీల్దార్, ఆర్‌డీవోతో పరిచయం ఉందని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనకు బాగా తెలుసని చెప్పాడు. ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడుతున్నారని, రూ. 5 లక్షలు ఇవ్వాలని, లేదంటే భవనం గురించి పత్రికలో రాసి కూల్చివేయిస్తానని బెదిరించాడు. దీంతో రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రామును గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.