- రూ.20 లక్షలు డిమాండ్ చేసిన దుండగుడు
- వ్యక్తిపై కేసు నమోదు
కరీంనగర్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడి పల్లి సత్యంను ఫోన్‌చేసి బెదిరించి, రూ.20 లక్షలు డిమాండ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకా రం.. సెప్టెంబర్ 28న మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి రూ.20 లక్షలు చెల్లించాలని, లేకుంటే రాజకీయంగా అప్రతిష్ఠపాలు చేస్తానని, ఇద్దరు పిల్లలను అనాథలు అయ్యేలా చేస్తానని బెదిరింపులకు పాల్పడి నట్టు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు విచారణ జరిపిన పోలీసులు నిందితుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని భవానినగర్‌కు చెందిన యాస అఖిలేశ్‌రెడ్డిగా గుర్తించి, కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రస్తుతం లండన్‌లో ఉండగా, అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడినట్టు తేలింది. నిందితుడిపై లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేశామని ఏసీపీ వెంకటరమణ తెలిపారు.