హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): గత కొన్నేళ్లుగా పోలీసు అధికారులను, మాజీ నక్సలైట్లను, నేరగాళ్లను ఇంటర్వ్యూ చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ బలివాడ మురళీధర్‌కు ఓ బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఇకపై ఇంటర్వ్యూలు చేయవద్దని, స్క్రీన్‌పైకి రాకూడదని ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడు. ‘మీకేం కావాలి?’ అని మురళీధర్ అడిగేలోపే ‘త్వరలో యాక్షన్ చూస్తారు’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అలాగే అర్బన్ నక్సలిజంకు సంబంధించిన ఓ పోస్టర్‌ను కూడా నిందితుడు మురళీధర్‌కు పంపించాడు. దీనిపై మురళీ ధర్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేర కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాల్ అమెరికాలోని కాలిఫోర్ని యా నుంచి వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు.