2.17 లక్షలను కాజేసిన సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఓ మహిళను భయభ్రాంతులకు గురిచేసి, ఆమె ఖాతాలోని రూ. 2.17 లక్షలను కాజేశారు సైబర్ నేరగాళ్లు. వివరాలిలా ఉన్నాయి.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ మహిళా ఉద్యోగికి 9271224083 నంబర్ నుంచి కాల్ వచ్చింది. మీ పేరుతో ముంబై నుంచి తైవాన్‌కు పంపిస్తున్న పార్సిల్‌ను ముంబైలో స్వాధీనం చేసుకున్నామని, అందులో ఐదు పాస్‌పోర్టులు, ఐదు ఏటీఎం కార్డులు, 4.2 కేజీల బట్టలు, ఒక ల్యాప్‌టాప్, 5 వేల డాలర్ల నగదు, 200 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ఉన్నట్లు ఆమెను భయభ్రాంతులకు గురిచేశారు.
మనీలాండరింగ్, డ్రగ్ సరఫరా కింద క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కేసు విచారణకు సహకరించా లని, లేకపోతే అరెస్ట్ చేయాల్సి ఉం టుందని బెదిరించారు. దీంతో ఇదం తా నిజమేనని నమ్మిన బాధితురాలు తన పూర్తి వివరాలను వారికి అందించింది. అలాగే, విచారణలో భాగంగా ఆర్బీఐ సూచనల మేరకు తన బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును వారికి బది లీ చేయాలని, విచారణ పూర్తయ్యాక 24 గంటల్లో తిరిగి పంపిస్తామని చెప్పారు. దీంతో బాధితురా లు రూ. 2.17 లక్షలను బదిలీ చేసింది. అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించి శుక్రవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.