* 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్
న్యూఢిల్లీ, డిసెంబర్ 7: కేంద్ర రక్షణ శాఖ మంత్రి సంజయ్ సేథ్‌కు బెదిరింపు కాల్ విచ్చింది. ఈమేరకు తమకు రూ,50 లక్షలు చెల్లించాలని ఆయన కేంద్రమంత్రి ఫోన్‌కు ఆగంతకులు మెస్సేజ్ పంపించారు. దీంతో ఢిల్లీ పోలీసుకలు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శనివారం ఆయన వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తనకు రూ. 50 లక్షల దోపిడీకి సంబంధించిన మెస్సేజ్ వచ్చినట్లు ఆయన తెలిపారు.