calender_icon.png 18 March, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు ముప్పు

18-03-2025 12:46:19 AM

  1. డీలిమిటేషన్ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకే అఖిలపక్ష భేటీ
  2. డిప్యూటీ సీఎం భట్టి 
  3. సమావేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ గైర్హాజరు

హైదరాబాద్, మార్చి 17 (విజయక్రాంతి): లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై అన్ని పార్టీల అభిప్రాయాల సేకరణ కోసమే అఖిల పక్ష నిర్వ హిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. అసెంబ్లీ హాల్‌లో సోమవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమా వేశానికి బీఆర్‌ఎస్, బీజేపీ మినహా కాంగ్రెస్, సీపీఐ, ఎంఐఎం, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మాస్‌పంథా, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నేతలు హాజరై డీలిమిటేషన్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా డిప్యూ టీ సీఎం మాట్లాడుతూ.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోతాయని, తెలంగాణకు కూడా ఆ ముప్పు ఉందని, ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలకు అ తీతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

వివిధ పార్టీలకు చెందిన నేతల అభిప్రాయాలు ఇలా..

ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన నియోకజవర్గాల పునర్విభజనను వ్యతిరేకించాల్సి ఉందని, దీనిపై శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయాల్సి ఉంద అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం శాస్త్రీయంగా ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు మాట్లాడుతూ.. డీలిమిటేషన్ ద్వారా ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగొద్దని, కేంద్రం అవసరమైతే డీలిమిటేషన్‌ను కొంతకాలం వాయిదా వేయాలని సూచించారు. సీపీఐ శాసనసభా పక్షనేత కే సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతానికి అను గుణంగా, దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్య పెంచాల్సి ఉందని, శాస్త్రీయమైన సీట్ల సాధనకు పోరాటానికి సిద్ధం కావాలని పిలు పునిచ్చారు.

సీపీఎం మాస్‌లైన్ నేత హనుమేశ్ మాట్లాడుతూ.. ఫెడరల్ స్టేట్ అంటే ప్ర తి రాష్ట్రానికి సమాన హక్కులు ఉండాలని, డీలిమిటేషన్‌పైనా హక్కులు అలాగే ఉండాలని అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మాట్లాడుతూ..

ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్ల శాతం ప్రకారం, దక్షిణాదిలోనూ నియోజకవర్గాలను పెంచాల్సి ఉందని అభిప్రా యపడ్డారు. సమావేశానికి మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి, పల్లా వెంక ట్‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్య దర్శి బాలకృష్ణ హాజరయ్యారు.

పీసీసీ చీఫ్ అలక? 

ఆహ్వానం అందలేదని వ్యాఖ్యలు

డీలిమిటేషన్‌పై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ డుమ్మా కొట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాల కారణం తో పీసీసీ చీఫ్ సమావేశానికి హాజరు కాలేదనే చర్చ మొదలైంది. అంతకుముందు సీఎం, డిప్యూటీ సీఎం నేతృ త్వంలో జరిగిన రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభోత్సవానికి హాజరైన పీసీసీ చీఫ్, ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే అసెంబ్లీ హాల్‌లో అఖిల పక్ష సమావేశానికి హాజరుకాకపోవడం చర్చకు దారి తీసింది.

గైర్హాజరు అంశంపై పీసీసీ చీఫ్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘నాకు ఆహ్వానం అంది ఉంటే కచ్చితంగా హాజరయ్యేవాడిని’ అని సమాధానం ఇచ్చినట్లు ఇస్తూనే, వెంటనే మాట మారుస్తూ.. తనకు వేరే పని ఉండడంతోనే గైర్హారయ్యాయని చెప్పడం గమనార్హం. మరోవైపు అఖిలపక్ష సమావేశం తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ.. ఈ అఖిల పక్ష భేటీ ప్రాథమిక సమావేశమేనని, సమావేశానికి కొన్ని పార్టీలు గైర్హాజరయ్యాయని పేర్నొన్నారు.

భవిష్యత్తులో అన్ని పార్టీలు డీలిమిటేషన్‌పై కలిసి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చెన్నైలో ఈనెల 22న తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరగనున్న అఖిల పక్ష సమావేశానికి తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందం వెళుతుందని, ఈ బృందంలో ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరు ఉంటారని పేర్కొన్నారు.

అనంతరం సమావేశానికి పీసీసీ చీఫ్ గైర్హాజరుపై.. కొందరు మీడియా ప్రతినిధులు ఆయన్ను ప్రశ్నించగా.. ఆహ్వాన సంగతులేవీ తనకు తెలియదని, అదంతా డిప్యూటీ సీఎం భట్టి చూసుకున్నారని స్పష్టం చేశారు.