calender_icon.png 1 November, 2024 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీకోటి ప్రవీణ్ వ్యాఖ్యలతో శాంతిభద్రతలకు ముప్పు

25-07-2024 01:24:52 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): న్యాయవాది, సామాజికవేత్త కదిరే కృష్ణపై భౌతిక దాడులు చేయాలంటూ బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్రంలో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదమున్నదని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు వాసు కె యాదవ్ అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ.. వేంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగులో అనువదిస్తూ కదిరే కృష్ణ వివరణ ఇచ్చారే గానీ ఎవరిని నిందించలేదు, ధూషించలేదన్నారు.

కృష్ణ మాట్లాడిన మొత్తం వీడియోను చూపించకుండా కాంట్రవర్సీ చేసే అంశాలను మాత్ర మే కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ, వ్యక్తిగత ఇమేజ్ కోసం వాడుకోవాలని ప్రవీణ్ చూస్తున్నారని విమర్శించారు. తన మాటల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలని కృష్ణ కోరినట్లు చెప్పారు. ప్రవీణ్‌పై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు తులసి, సునీత, వెంకట్, మహేష్, కిరణ్, రాజేష్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.