బీఆర్‌ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ పరిపాలనలోనే చెరువులు వేల సంఖ్యలో కబ్జాకు గురయ్యాయని, చెరువుల అక్రమణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని బీఆర్‌ఎస్ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల ఆక్రమణ, ఎఫ్‌టీఎల్ ,బఫర్ జోన్‌లపై ప్రజలను గందర గోళం చేసే కుట్రలు చేస్తుందన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో బొమ్మెర రామ మూర్తితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చెరువులు ఆక్రమణకు గురైనట్లు భట్టి ఆరోపణలు చేయడం ఆయన స్దాయిని దిగజార్చుతుందన్నారు.
కేసీఆర్ హయంలో నాలుగు దశల్లో మిషన్ కాకతీయ పథకం కింద 28 వేల చెరువులు బాగు చేసి, 250కి పైగా టీఎంసీలను చెరువుల్లో నిల్వ చేసి 25 లక్షల ఎకరాలకు నీళ్లు అందించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లా మారిందని, బుల్డోజర్లు పేదల ఇండ్ల పైకి పంపడం తప్ప ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడం లో విఫలమయ్యారని పేర్కొన్నారు.
అనంతరం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభ ప్రద్ పటేల్ ప్రసంగి స్తూ సీఎం రేవంత్ ఉద్యోగ నియామకాలపై అబద్దాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయ త్నం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారని పేర్కొన్నారు.