గుజరాత్‌లో ఓ కంపెనీ ఉద్యోగాల భర్తీ ప్రకటన
గాంధీనగర్, జూలై 11 : దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పే ఓ ఘటన కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ రాష్ట్రం భరూచ్ జిల్లా అంకలేశ్వర్ సిటీలో థర్మాక్స్ అనే ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది. షిఫ్ట్ ఇన్‌ఛార్జ్, ప్లాంట్ ఆపరేటర్, సూపర్‌వైజర్, మెకానికల్ ఫిట్టర్, ఎగ్జిక్యూటివ్ ఇలా 5 పోస్టుల భర్తీ కోసం కెమికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్, ఐటీఐ పూర్తి చేసిన వారు వాక్‌ఇన్‌కు హాజరు కావచ్చని తెలిపింది. వాక్‌ఇన్ ఇంటర్వ్యూకు నిరుద్యోగులు పోటెత్తారు. కేవలం 10 ఉద్యోగ ఖాళీల కోసం వేలాది మంది తరలివచ్చారు. నిరుద్యోగుల తాకిడికి హోటల్ ఆవరణలోని సెక్యూరిటీ రెయిలింగ్స్ విరిగిపోయాయి. తోపులాటలో కొంతమంది నిరుద్యోగులు కొంద పడిపోయారు. తొక్కిసలాట తరహా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.