అభివృద్ది కోసమే అధికార పార్టీలోకి వచ్చారు
నియోజకవర్గ అభివృద్దియే పోచారం ధ్యేయం
కవిత పోచారంపై మాట్లాడటం సరికాదు
నాయకుడు, రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి...
కామారెడ్డి (విజయక్రాంతి): అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో కూడా జరగనంత అభివృద్దికి బాన్సువాడ నియోజకవర్గ అభివృద్దికి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రూ.10 వేల కోట్ల నిధులు తెచ్చిన మాట వాస్తవమేనని కాంగ్రెస్ నాయకులు రైతుబంధు మాజీ జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం బాన్సువాడకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీరుపై మాట్లాడటం సరికాదన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడం వల్లే నియోజకవర్గ ప్రజలు గెలిపించారని అన్నారు. పార్టీ ముఖ్యం కాదని నియోజకవర్గ అభివృద్దే ముఖ్యమని పోచారం భావించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారని టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరారని ప్రస్తుతం కాంగ్రెస్‌లోకి చేరారని తెలిపారు.
నియోజకవర్గాన్ని అభివృద్ది చేయాలని ద్యాస పోచారం శ్రీనివాస్‌రెడ్డిలో ఉందన్నారు. పార్టీకి ద్రోహం చేయలేదని నియోజకవర్గ అభివృద్ది కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరి అభివృద్దికి కృషి చేస్తున్నారన్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా బాన్సువాడ నియోజకవర్గంలోనే ఎక్కువగా కట్టించిన ఘనత పోచారందేనన్నారు. పోచారంకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు నియోజకవర్గ ప్రజల అభివృద్ది కోసం కాంగ్రెస్‌లో చేరరన్నారు. సిద్దాపూర్ ఎత్తిపోతలతో పాటు పోతంగల్, కోటగిరి మండలాల్లో ఎత్తిపోతల పనులు జరిపించేందుకు కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. పోచారాన్ని విమర్శించడం ఎమ్మెల్సీ కవితకు తగదన్నారు. పోచారం గెలుపును కవిత ప్రస్తవించడం అభినందనీయమన్నారు. పదివేల కోట్ల అభివృద్ది చేశారని చెప్పడం అభినందించదగిన విషయమన్నారు. ఈ సమావేశంలో బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.