calender_icon.png 19 April, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్షిక పరీక్షల వేల.. ప్రైవేట్ ‘ఫీజు’లుం

11-04-2025 12:00:00 AM

పరీక్ష పెట్టకుండా నిలబెడుతున్న వైనం

రామకృష్ణాపూర్, ఏప్రిల్ 10 : ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది... వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు. కేవలం పరీక్ష ఫలితాలను ప్రచారం చేసుకుంటున్న పాఠశాల లు ఇష్టారాజ్యంగా ఫీజులను ఏడాదికి ఏడాది పెంచుతూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు మానసిక క్షోభను కలిగిస్తున్నాయి.

తమ పిల్లలకు మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో మాత్రమే పిల్లల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇదే అదునుగా మార్చుకున్న సంస్థలు ఈ-టెక్నో, కాన్సెప్ట్, టాలెంట్ వంటి పేర్లతో పాఠశాలలు నెలకొల్పి విద్యా వ్యాపారాలకు తెర తీస్తున్నారు.

ఉపాధ్యాయులపై ఒత్తిడి..

వార్షిక పరీక్షలు ముగిసేనాటికి విద్యార్థుల ఫీజు బకాయిలు వసూలు చేయాలని, లేని పక్షంలో జీతం ఆపుతామని యాజమాన్యాలు బెదిరిస్తుండటంతో తట్టుకోలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఒత్తిడి చేయడం తప్పడం లేదంటూ వాపోతున్నారు. ఒక మిషనరీ పాఠశాల హెచ్ ఎం అయితే విద్యార్థుల ఫీజు బకాయి ఉంటే వారిని తరగతి గదుల్లోకి అనుమతించవద్దని, నా అనుమతి పత్రం ఉంటేనే గదిలోకి రానియ్యాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం.

యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా విద్యార్థులతో ఇలా కఠినంగా వ్యవహ రించే ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలపై సంబంధిత శాఖ మండల, జిల్లా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు.

పరీక్ష పెట్టకుండా.. తరగతి బయట నిలబెడుతూ..

రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఫీజులను పైసా తక్కువ ఉన్నా పరీక్షకు అనుమతివ్వడం లేదు... ఫీజుల విషయంలో మూ ర్ఖంగా వ్యవహరిస్తూ చిన్న పిల్లలని కూడా చూడకుండా ఎల్ కే జి, యూ కే జీ విద్యార్థులను సైతం ఫీజు డ్యూ ఉందంటూ.

తరగతి గది ముందు విద్యార్థులను నిలబెట్టడం, పరీక్ష రాయనీయమంటూ ఇతర దండనలు విదిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో చిన్నారులు మనోవేదనకు గురవుతున్నారు. పిల్లల తల్లిదండ్రులకు సమయం ఇవ్వండని వేడుకున్నా కనికరించకపోవడంతో మానసిక క్షోభను అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.