calender_icon.png 14 January, 2025 | 6:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయ్యేళ్ల జైన శిల్పాలను పరిరక్షించాలి

14-01-2025 01:20:30 AM

వికారాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): వెయ్యేళ్ల జైనశిల్పాల్ని పరిరక్షించాల్సిన అవసరముందని పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం కంకల్‌లో, నవాబుపేట్ మండలం ఎల్లకొండ గ్రామంలో తన బృందంతో కలిసి పర్యటించిన శివనాగిరెడ్డి అక్కడి పురావస్తు శిల్పాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. కంకల్, ఎల్లకొండ గ్రామాల్లో వెయ్యేళ్ల చరిత్ర ఉన్న జైనమత శిల్పాలు ఉన్నట్లు తెలిపారు. 50కి పైగా చారిత్రక శిల్పాలు ఆలనాపాలన లేక నిర్లక్ష్యానికి గురవుతున్నట్లు తెలిపారు. కంకల్ గ్రామంలోని గణేశాలయం, శివాలయం, ఊరి మధ్యలో, గ్రామ శివారులో బాదామి చాళుక్య రాష్ట్రకూట, కల్యాణిచాళుక్య, కాకతీయలు కాలానికి చెందిన అపురూప శిల్పాలు ఇక్కడ ఉన్నట్లు తెలిపారు. 

వికారాబాద్ జిల్లాలోని ఎల్లకొండ, కంకల్ గ్రామాల్లోని దేవాలయాలకు వెయ్యి ఏళ్లనాటి జైనక్షేత్ర చరిత్ర ఉందన్నారు. కంకల్ గ్రామంలో ఉన్న శిల్పాలను ఒకేచోట చేర్చి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఆయన జిల్లా అధికారులను కోరారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన గుట్టుపల్లి మల్లేశ్, నీరటి రాములు, చిన్నికృష్ణ, శివాలయం పూజారి  పాల్గొన్నారు.