calender_icon.png 21 September, 2024 | 11:23 PM

83 వేల విలువైన డ్రగ్స్ పట్టివేత

20-09-2024 12:14:03 AM

ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): వచ్చే వేతనం సరిపోక తక్కువ సమయంలో భారీగా డబ్బు సంపాదించడానికి డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నారు ముగ్గురు యువకులు. తీరా పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఏమార్ట్ అనే ముగ్గురు యువకులు ప్రయివేట్ ఉద్యోగం చేస్తున్నారు. వచ్చే వేతనం సరిపోకపోవడంతో డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకోని, బెంగళూరు నుంచి డ్రగ్స్ సరఫరా చేసే ఓ వ్యక్తి ద్వారా డ్రగ్స్ కొనుగోలు చేసి రెట్టింపు ధరలకు విక్రయించేవారు.

మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ తిరుపతి యాదవ్ తన టీంతో బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో తనిఖీలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఒక్కో ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ను రూ. 15 వేలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. వీరి నుంచి రూ. 83 వేల విలువ చేసే 5.77 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

డ్రగ్స్ సరఫరా చేస్తున్న విద్యార్థులు.. 

ముగ్గురి అరెస్ట్

శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 19: డ్రగ్స్ రవాణాపై ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం లేకుం డా పోతోంది. నగరంలో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట డ్రగ్స్ రవాణా చేస్తు న్న ముఠాలు పట్టుబడుతూనే ఉన్నా యి. ఈసారి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఇంజినీరింగ్ విద్యార్థులు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాలిలా ఉన్నాయి.. చెన్నై, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు.. నగరంలోని పలు కాలేజీలకు చెందిన విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.

ఇదే క్రమంలో బుధవారం రాత్రి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో డీటీఎఫ్ టీం సభ్యు లు దాడులు చేశారు. వారి నుంచి 30 ఎల్‌ఎస్‌డీ డ్రగ్ స్ట్రిప్స్‌ను, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయి న వారిలో ఇంజినీరింగ్ చదువుతున్న చెన్నైకి చెందిన చరణ్‌తేజ్, కౌశిక్, సయ్యద్ ఉన్నారు. మరో నిందితుడు సర్ఫరాజ్ పరారీలో ఉన్నాడని, నిందితులు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొ స్తున్నారు.. ఎవరెవరికి సరఫరా చేస్తున్నారన్న సమాచారం సేకరిస్తున్నట్లు డీటీఎఫ్ అధికారులు తెలిపారు.