calender_icon.png 8 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెయ్యి గొంతులులక్ష డప్పుల మహాకళ ప్రదర్శన

07-01-2025 01:11:38 PM

హుజరాబాద్,(విజయక్రాంతి): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ పిలుపు మేరకు, వెయ్యి గొంతులు, లక్ష డప్పులు మహాకళా ప్రదర్శన నిర్వహణ కమిటీ(Maha Kala Exhibition Organizing Committee) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఏపూరి సోమన్న(Epuri Somanna) నేతృత్వంలో ఫిబ్రవరి 7వ తారీకు నాడు జరగబోయే వెయ్యి గొంతులు, లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ గా ఆకినపెళ్లి శిరీష నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆకినపెళ్లి శిరీష మాట్లాడుతూ ఫిబ్రవరి 7వ తారీకు నాడు జరగబోయే వెయ్యి గొంతులు, లక్ష డప్పులు మహా కళా ప్రదర్శన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మన హక్కుల కోసం మొదటిసారి డప్పులు కొడుతున్నం, జనవరి 7 నుంచి కళానాయకుల కవాతు-మాదిగలంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ జెండా పట్టుకుని మందకృష్ణ మాదిగ పోరాడుతున్నారు. వారు చేపట్టిన మాదిగ కళా నాయకుల కవాతుకు మద్దతుగా మాదిగలు అంతా సహకరించాలని ఆకినపెళ్లి శిరీష కోరారు.