calender_icon.png 25 November, 2024 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10 వేల మంది విద్యార్థులు.. 600 మ్యాథ్స్ ఫార్ములాలు

05-11-2024 02:40:01 AM

ఈ నెల 6న ఏకకాలంలో పఠనం చేయనున్న శ్రీచైతన్య విద్యార్థులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): శ్రీచైతన్య వి ద్యార్థులు ఈ నెల 6వ తేదీన ప్రపంచ రికార్డు కార్యక్రమంలో పాల్గొననున్నారు. 10 వేల మంది విద్యార్థులు 600 మ్యాథ్స్ ఫార్ములాలను ఏకకాలంలో పఠనం చేయడంతో ప్రపంచ రికార్డు సాధించనున్నారు.

విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రత్యేక ప్రతిభను, వివిధ రంగాల్లో సాధించిన అద్భుత విజయాలను డాక్యుమెంట్ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వరల్డ్ బుక్ ఆప్ రికార్డ్స్ (యూకే) ఈ నెల 6న బాల మేధావులతో మరో కార్యక్రమం చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెం దిన 10 వేల మంది విద్యార్థులు 600 మ్యాథ్స్ ఫార్ములాలను ఏకకాలంలో పఠనం చేయడానికి సన్నద్ధమయ్యా రు.

ఇప్పటికే 2018లో రెండున్నర సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల 100 మంది విద్యార్థు లు 100 దేశాల మ్యాప్‌లను పఠించి, భౌగోళిక అవగాహనలో అద్భుతమైన ఫీట్ సాధించారు. 2022లో 601 మంది విద్యార్థులు 118 అంశాలను పఠించి 10 రాష్ట్రాలలో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టికను ప్రదర్శించారు.

2023లో 2023 మంది విద్యార్థులు 100 నిమిషాల్లో 1 నుంచి 100 మ్యాథ్స్ టేబుల్స్ పఠించారు. ఫైనల్ జడ్జిమెంట్‌లో శ్రీచైతన్య విద్యార్థులు ప్రదర్శన విజయవంతంగా పూర్తయితే.. చారిత్రాత్మక సూపర్ రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యా ంస్థల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రపంచ రికార్డుల పఠనంలో పాల్గొననున్న వారికి సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు.