calender_icon.png 1 October, 2024 | 2:46 AM

దసరాకు 6 వేల ప్రత్యేక బస్సులు

01-10-2024 12:58:29 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొం తూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్‌ఆర్ మీదుగా విజయవాడ,  బెంగళూరు తదితర ప్రాంతాల కు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది.

దసరాకు ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాం తాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై క్షేత్రస్థాయి అధికారులతో సోమవారం టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. రవాణాపరమైన ఇబ్బందు లు తలెత్తకుండా 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అక్టో బర్ 1 నుంచి 15 వరకు ఈ బస్సులు ప్రయాణీకులకు అందుబాటులో ఉం టాయని వివరించారు.

రద్దీ రోజుల్లో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో మాట్లాడి ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేక లేన్లను కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్‌బీ, సంతోష్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ దసరాకు కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో కొత్త ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించుకోవాలన్నారు. టీజీఎస్‌ఆర్టీసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేష న్‌ను సంస్థ అధికారిక వెబ్ సైట్ https://www.tgsrtc.telangana.gov.in/ చేసుకోవాలని సూచించారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం తమ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని కోరారు.