26-04-2025 11:20:17 PM
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దిన్...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నుంచి వరంగల్ సభకు 20 వేలమందిని బీఆర్ఎస్ ముఖ్య నేతలను తరలిస్తున్నట్లు కామారెడ్డి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దిన్ తెలిపారు. శనివారం విజయక్రాంతి ప్రతినిధితో ఆయన స్వగృహంలో మాట్లాడారు. ప్రతి నియోజకవర్గం నుంచి 33 ఆర్టీసీ బస్సులు 36 ప్రైవేట్ బస్సులలో వరంగల్ సభకు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గ ప్రతినిధిగా బాన్సువాడ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, జుక్కల్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే, ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ల ఆధ్వర్యంలో వరంగల్ సభకు తరలి వెళ్తున్నట్లు తెలిపారు.
ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు 25వ బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ అధినేతలు కేసిఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులు హాజరవుతున్నట్లు తెలిపారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీటీసీలు ఈ సభకు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రైవేట్ బస్సులలోనే కాకుండా సొంత వాహనాలలో కూడా తరలివస్తున్నట్లు తెలిపారు. కెసిఆర్ సభ చరిత్ర ఆత్మకంగా ఉంటుందని ఆయన తెలిపారు.
జిల్లా నుంచి 20వేల మంది బిఆర్ఎస్ ప్రతినిధులు తరలించడమే కాకుండా సొంత వాహనాలలో కూడా పెద్ద ఎత్తున టిఆర్ఎస్ నాయకులు తరలి వస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ఏ ఒక్క హామీని ప్రజలకు నెరవేర్చలేదని స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం ఖాయమని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన తెలిపారు. మళ్లీ టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని కెసిఆర్ నాయకత్వంలో టిఆర్ఎస్ తెలంగాణలో అధికారం రావడం ఖాయం అన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ఏ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు పరచకుండా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు పరచకపోవడంతో ప్రజలు విసుగు చెందారని అన్నారు. అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు విసుగు చెందారని తెలిపారు.