calender_icon.png 27 October, 2024 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూపీఎస్‌తో 63వేల మందికి ప్రయోజనం

28-08-2024 01:12:13 AM

ద.మ. రైల్వే పీసీపీఓ కిషోర్ బాబు

హైదరాబాద్, ఆగస్టు 27 (విజయక్రాంతి) : ఇటీవల ఆమోదించిన ‘యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్’(యూపీఎస్)తో దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సుమారు 63,000 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుస్తుందని దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కిషోర్ బాబు తెలిపారు. ఇది జోన్‌లో మొత్తం ఉద్యోగులలో సుమారు 75 శాతం అని తెలిపారు. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో విలేఖరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. యూపీఎస్‌ను నూతన పెన్షన్ పథకం చందాదా రులైన అన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంచుకోవచ్చని తెలిపారు. ఈ కొత్త పథకం ద్వారా సుమారు 23 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

యూపీఎస్ 2025 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుందన్నారు. దీనిలో 5 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. పింఛన్ హామీ, కుటుంబ పింఛన్ హామీ, కనీస పింఛన్ హామీ, ద్రవ్యోల్బణ సూచిక, సూపరాన్యుయేషన్ సమయంలో లంప్-సమ్ చెల్లింపు, గ్రాచ్యుటీ ప్రయోజనాలు వర్తిస్తాయన్నారు. నూతన పెన్షన్ పథకంతో  పోలిస్తే యూపీఎస్ మరింత ప్రయోజనకరమని, ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంద న్నారు. సమావేవంలో దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వుజర్ వివేకానంద, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.