calender_icon.png 6 March, 2025 | 6:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొలిరోజు 17 వేల మంది డుమ్మా

06-03-2025 12:51:04 AM

  1. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు షురూ
  2. రెండు మాల్‌ప్రాక్టీస్ కేసులు 
  3. నేటి నుంచి  ద్వితీయ సంవత్సరం పరీక్షలు

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): ఇంటర్ పరీక్షలు తొలిరోజు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైనట్టు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ పరీక్ష నిర్వహించారు. అయితే ఈ పరీక్షకు భారీగా విద్యార్థులు డుమ్మాకొట్టా రు. మొత్తం 5,14,184 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 4,96,899 మందే పరీక్షకు హాజరయ్యారు.

మిగిలిన 17,010 (3.42 శాతం) మంది పరీక్ష రాయలేదు. తొలిరోజు రెండు చోట్ల మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదయ్యా యి. హనుమకొండ, వరంగల్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య హైదరాబాద్‌లోని పలు సెంటర్లలో తనిఖీ నిర్వహించారు. నారాయణగూడలోని రత్నా జూనియర్ కాలేజీ, జాహ్నవి, శ్రీచైతన్య కళాశాలల్లో పరీక్షల నిర్వహణ తీరును ఆయన స్వయంగా పరిశీలించారు.

అలాగే సిద్దిపేట, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వనపర్తి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొం డ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు బోర్డు నుంచి తనిఖీల కోసం పరిశీలకులు  వెళ్లిన ట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. ఎలాంటి సం ఘటనలు జరగకుండా పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు వెల్లడించారు.గురువారం సెకండియర్  పరీక్షలు ప్రారంభం కానున్నాయి.