రూ.4 వేల కోట్లతో ఏర్పాటుపై దృష్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈల సమ్మిళితమైన, స్థిరమైన వృద్ధి ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకోసం పాలసీని రూపొందించి అమలుకు అవసరమైన ఆర్థిక కేటాయింపులు చేయనుంది. రాబోయే ఐదేండ్లలో 25 వేల కొత్త ఎంఎస్‌ఎంఈలు ఈ పాలసీ ద్వారా లాభాన్ని అందుకుంటాయి. దీనిలో 15 వేల ఎంఎస్‌ఎంఈలు ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ఉండే అవ కాశం ఉంది. దీని కోసం రాబోయే ఐదేండ్లలో రూ. 4 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించనున్నది. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు.
పాలసీ అమలులో కీలక అంశాలు..
స్ట్రీమ్‌ెే1: పాలసీని సమర్థవంతంగా అమలు చేయడంలో సహకరించేందుకు పరిశ్రమలు, వాణిజ్య డైరెక్టర్, ఎంఎస్‌ఎంఈ అండ్ రిటైల్, ప్రత్యేక వ్యాపార రంగాల డైరెక్టర్లు, తెలంగాణ ఇండస్ట్రీయల్ డెవలప్‌మెం ట్ కార్పొరేషన్, హెల్త్ క్లినిక్ లిమిటెడ్, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, తెలంగా ణ ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వంటివి కృషి చేయనున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు వారి వర్కింగ్ క్యాపిటల్ విషయంలో మద్దతు ఇవ్వడానికి, సకాలంలో నిధులు, ప్రోత్సాహాకాల పంపిణీని సులభతరం చేస్తా యి. వివిధ విభాగాల పోర్టల్ నుంచి సేకరించిన డేటాను ఉపయోగించి ఆన్ ఇన్ వన్ పోర్టల్‌లో ఉంచి డ్యాష్ బోర్డును రూపొందిస్తారు. బెస్ట్ ఇన్ క్లాస్ డిజిటల్ సొల్యూషన్స్ డెవలప్ చేయడానికి థర్డ్ పార్టీ నిష్ణాతులను నియమిస్తారు. పీపీపీల వంటి వినూత్న నమూనాల ద్వారా పారిశ్రామిక పార్కులు, స్థానిక పరీక్షా కేంద్రాలు, గిడ్డంగుల సౌకర్యాల వంటి సహాయక మౌలిక సదు పాయాలను అభివృద్ధి చేస్తారు.
స్ట్రీమ్ రెగ్యులర్ ఇండస్ట్రీ ఫీడ్ బ్యాక్ తీసుకోవడానికి, ఎంఎస్‌ఎంఈ విభాగం ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ఎంఎస్‌ఎంఈలు నేరుగా తమ సమస్యలను నివేదించవచ్చు. విభాగానికి చెందిన అధికారులు తరచుగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తారు. ప్రతినెల స్వీకరించిన ప్రశ్నలు, పరిష్కరించిన సమస్యలు, వాటికి కంటెంట్ విశ్లేషణ, పెండింగ్ వేసిన సమస్యలు వంటి సూచికలను రికార్డు చేసే డ్యాష్‌బోర్డును సిద్ధం చేస్తారు.
స్ట్రీమ్ ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో, ప్రభావవంతమైన మార్గదర్శనం అందించడానికి, ప్రభుత్వం థర్డ్‌పార్టీ నిపుణులతో సహకారం అందిస్తుంది. ఎంఎస్‌ఎంఈలతో ప్రత్యక్ష వ్యాపార సలహాదారుల సేవలను తీసుకుంటుంది. వెనుకబడిన తరగతుల వారి వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి అవగాహన సదస్సులను నిర్వహిస్తుంది. ఎంఎస్‌ఎంఈలకు సాంకేతిక పరిష్కారాలు, గ్లోబల్ మార్కెట్‌లపై మెరుగైన అవగాహనను పెంపొందించడంలో సహాయ పడటా నికి వ్యాపార అభివృద్ధిపై నిపుణుల మార్గదర్శకత్వాలను అందిస్తారు.
పర్యవేక్షణకు స్టీరింగ్ కమిటీ..
పాలసీ అమలును పరిశ్రమలు, వాణి జ్య శాఖ మంత్రి అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ పర్యవేక్షిస్తుంది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, పరిశ్రమల శాఖ కమిషనరేట్ అధికారులు, డైరెక్టర్, ఎంఎస్‌ఎంఈ, రిటైల్, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు కమిటీలో ఉండనున్నారు. పాలసీ అమలు, వార్షిక ప్రగతి నివే దికను శాసనసభకు సమర్పించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ కమిటీ ఉత్పత్తి కారకాల సముపార్జన, ఉపయోగం, సవాళ్లను పరిష్కరించేందుకు పనిచేయనున్నది. ఎం ఎస్‌ఎంఈ వృద్ధిపై తెలంగాణ భాగస్వా మ్యం, కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకోవడంపై త్రైమాసిక సమీక్షను నిర్వహిస్తుం ది. క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్, టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్‌గ్రేడేషన్ స్కీమ్, లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటీటివ్‌నెస్ స్కీమ్, డిజైన్ ఎక్స్‌పర్టుజ్ కోసం డిజైన్ క్లినిక్ స్కీమ్, ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక సహాయం వంటి పథకాలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది.