- మంత్రి పొంగులేటి వెల్లడి
- కులగణనతోనే రిజర్వేషన్ సాధ్యం: మంత్రి తుమ్మల
ఇల్లెందు, నవంబర్ 3: రాష్ట్రంలోని ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్డ డానియల్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణా స్వీకారోత్సవం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేస్తుంటే ఓర్వలేని బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డా రు. అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని, మరో పదేళ్లపాటు రాష్ట్రంలో ఇందిర మ్మరాజ్యం కొనసాగేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రణాళిక రూపొందించారని చెప్పారు.
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాం తాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానన్నారు. కులగణనతోనే రాజకీయ, ఉద్యోగ, విద్యారంగాల్లో రిజర్వేషన్ సాధ్యమని చెప్పా రు.
కార్యక్రమంలో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, కార్పొరేషన్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, మువ్వ విజయబాబు, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసానీ లక్ష్మినారాయణ, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.