calender_icon.png 23 October, 2024 | 5:00 PM

ఐదేండ్లలో 20వేల ఇందిరమ్మ ఇండ్లు

05-05-2024 12:28:15 AM

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 

మహబూబ్‌నగర్, మే 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేండ్లలో 20 వేల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, నిరుపేదలకు అందిస్తుందని ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు పాలమూరు రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. కానీ ఆయన నాడు ముఖ్యమంత్రిగా మెదక్ జిల్లాకు రూ.50 వేల కోట్ల నిధులను మళ్లించుకున్నారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ పేద రాష్ట్రంగా మార్చారన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఇంకా నష్టం జరుగుతుందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను గాడిలో పెట్టే పనిలో నిమగ్నమయ్యారన్నారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన పలువరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సమావే శంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు ఓబేదుల్లా కొత్వాల్, జునైటల్ ఖురేషి పాల్గొన్నారు.