calender_icon.png 24 December, 2024 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం అమ్మితే 50 వేల జరిమానా

07-10-2024 12:00:00 AM

ఆజామాబాద్ తీర్మానం

కామారెడ్డి, అక్టోబర్ 6 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం ఆజామాబాద్ గ్రామం లో మద్యం అమ్మకాలు చేపట్టవద్దని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం అమ్మితే రూ.50 వేల జరిమానా విధించాలని ఆదివారం తీర్మానించారు. దీంతో కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటి ఆదర్శగ్రామంగా ఆజామా బాద్ నిల్వనుంది. ఆ గ్రామంలో 2 వేలకు పైగా జనాభా ఉంది. యువకులు మద్యానికి బానిసవుతున్నా రని గ్రహించిన గ్రామపె ద్దలు గ్రామం లో మద్యం అమ్మకాలు చేపట్టవద్దని ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యువకులతో కలిసి తీర్మానం చేశారు. గ్రామ కార్యదర్శికి  తీర్మాన ప్రతి ని అందించారు.