24-02-2025 12:47:27 AM
మునుగోడు,ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి) : మండలంలోని కల్వకుంట్లలో ఈదమ్మ ఆలయ నిర్మాణానికి నల్లగొండ డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి రూ.50,116 విరాళం ప్రకటించారు. ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు ఆయన విరాళం చెక్కును అందజే శారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కులమత బేధాలు లేకుండా గ్రామ స్తులంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండాలన్నారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పగిళ్ల భిక్షమయ్య, మాజీ ఉప సర్పంచ్ కుంభం యాదగిరి రెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బొందు రవి, ఇరుగుదిండ్ల భిక్షం, బొందు స్వామి, పులకరం రాములు, మంటిపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.