calender_icon.png 1 October, 2024 | 3:45 AM

ఆర్బీఐ వద్ద అప్పులు 50 వేల కోట్లు

01-10-2024 01:54:56 AM

పదినెలల్లో భారీగా పెరిగిన తెలంగాణ రుణాలు

నేడు సర్కార్ ఖజానాకు ఆర్బీఐ నుంచి మరో రూ.2 వేల కోట్లు

  1. జూలైలో అత్యధికంగా 8 వేల కోట్ల అప్పు

హైదరాబాద్, సెప్టెంబర్ 30(విజయక్రాంతి): ఆర్బీఐ వద్ద తెలంగాణ రుణాలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది నెలలు కావోస్తుంది. కానీ రిజర్వ్ బ్యాంక్, హడ్కో లోన్లు కలిపి రాష్ట్ర రుణాలు రూ.50 వేల కోట్లు దాటినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలై నెలలో రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వం గరిష్ఠంగా రూ.8వేల కోట్లను రుణంగా తీసుకుం ది. కనిష్ఠంగా గతేడాది డిసెంబర్‌లో రూ. 1400 కోట్లను రుణంగా పొందింది. సెప్టెంబర్‌లో కూడా ప్రభుత్వం సెంట్రల్ బ్యాంకు వద్ద ఆక్షన్‌కు నాలుగు సార్లు వెళ్లింది. గత నెల రుణాల రూపంలో ఆర్బీఐ నుంచి రాష్ట్ర ఖజానాకు రూ.4500కోట్లు జమయ్యాయి.

నేడు(అక్టోబర్ 1వ తేదీన) మరో రూ.2వేల కోట్లు ప్రభుత్వ ఖాతాలో పడనున్నాయి. ఇదే సమయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం హౌసింగ్ అండ్ అర్బన్ కార్పొరేషన్( హడ్కో) నుంచి దాదాపు రూ.3000 కోట్ల ను ఈ ఏడాది మార్చిలో తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పదినెలల్లో అన్ని కలిపి మొత్తం అప్పులు రూ.51,618 కోట్లకు చేరుకున్నట్లు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అప్పుల్లో 38 శాతానికి పైగా వడ్డీలకే.. 

తెలంగాణలో  డిసెంబర్ 9, 2023న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల నుంచి అప్పుల కో సం ఆర్బీఐని ఆశ్రయిస్తోంది. గత ప్రభుత్వం చేసిన భారీ అప్పులు కాంగ్రెస్ సర్కార్‌కు గుదిబండగా మారాయి. ఆ అప్పులకు వడ్డీ లు కడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల అమలు, అభివృద్ధి చేయాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పు లు తేవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

అయితే తెచ్చిన అప్పుల్లో కూడా 38 శాతానికి పైగా ప్రభుత్వం వడ్డీలకు చెల్లిస్తుండం గమనార్హం. ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ.6వేల కోట్ల రుణాలను తీసుకుంది. ఇదే ఆగస్టు నెలలో రూ. 2304.71కోట్లను వడ్డీల కింద చెల్లించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వడ్డీల భారాన్ని తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోం ది.

గత బీఆర్‌ఎస్ సర్కారు ఎక్కువ శాతం వడ్డీలకు భారీగా రుణాలను తెచ్చింది. బహిరంగ మార్కెట్‌లో 7 శాతం నుంచి 7.30 శా తం వడ్డీలకు రుణాలు ఇస్తున్నారు.  అయితే బీఆర్‌ఎస్ మాత్రం 11 శాతానికి పైగా  వడ్డీ రేటుతో అప్పులు తెచ్చింది. 

ఈ నేపథ్యంలో ఎక్కువ వడ్డీలు ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రా న్ని కోరుతోంది. రీస్ట్రక్చర్ చేసి.. తక్కువ వడ్డీలకు రుణాలను ఇచ్చే ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులకు ఆ అప్పులను బదిలీ చేయాలని వేడు కుంటోంది. అయితే కేంద్రం నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం.

ఆర్బీఐ వద్ద  రాష్ట్ర ప్రభుత్వం 

తీసుకున్న అప్పుల వివరాలు

తేదీ తీసుకున్న అప్పు (రూ.కోట్లలో)

12-12-2023 500

19-12-2023 900

16-01-2024 2,000

23-01-224 1,000

06-02-2024 2,000

13-02-2024 1,000

05--03-2024 2,000

12-03-2024 2,000

19-03-2024 2,000

26-03-2024 1,718

02-04-2024 1,000

08-04-2024 1,500

23-04-2024 1,500

07-05-2024 3,000

14-05-2024 1,000

04-06-2024 2,000

18-06-2024 2,000

25-06-2024 1,000

02-07-2024 2,000

16-07-2024 2000

23-07-2024 3000

30-07-2024 1000

06-08-2024 3000

13-08-2024 3000

03-09-2024 2500

10-09-2024 1500

17-09-2024 500

01-10-2024 2,000

మొత్తం 48,618

హడ్కో లోన్ 3,000

మొత్తం లోన్లు 51,618