13-04-2025 01:59:49 AM
* జూన్ 12 నుంచి మూడురోజుల పాటు ఫుడ్ ఎ ఫెయిర్
* ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్, ఇన్‌క్లూజివిటీ మేళవింపుతో అభివృద్ధికి ఊతం
* ఫుడ్ ఎ ఫెయిర్ పోస్టర్ ఆవిష్కరణలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): ఆహార, వ్యవసాయ ప్రాసెసింగ్ రంగంలో తెలంగాణ వేగంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. ఈ రంగంలో రూ.15,919 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో అమల్లో ఉన్నాయని చెప్పారు. బ్లిట్జ్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, హైటెక్స్ ఎగ్జిబిషన్ సహ కారంతో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రధాన భాగస్వామిగా ఫుడ్ ఎఫెయిర్ 2వ ఎడిషన్ నిర్వహించనున్నారు.
హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జూన్ 12 నుంచి 14 వరకు మూడు రోజుల పాటు జరుగునున్న ఈ అతిపెద్ద ఫుడ్ ఎ ఫెయిర్ (ట్రేడ్ ఫెయిర్) పోస్టర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు శనివారం ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ 7,150 ఎకరాల విస్తీర్ణంలో 14 ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేశామన్నారు.
పారిశ్రామికవేత్తలకు అత్యుత్తమ సాంకేతికత, ప్రపంచ స్థాయి శిక్షణ, పరిజ్ఞానం, విస్త్రృత మార్కెట్ ను అందించేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌క్లూజివిటీ మేళవింపుతో అభివృద్ధికి ఊతమిచ్చే వాతావరణాన్ని ప్రొత్స హిస్తున్నామని మంత్రి చెప్పారు.
ఆహారం, వ్యవసాయ, ప్రాసెసింగ్ రంగం లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టడానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని చెప్పారు. సూక్ష్మ, చి న్న, మధ్య తరహా పరిశ్రమల సాధికారికతకు ప్లగ్ అండ్ ప్లే తరహా మౌలిక సదు పాయా లు, ఆర్థిక ప్రోత్సాహకాలతో పాటు అనేక రకాలుగా చేయూతనిస్తోందని శ్రీధర్‌బాబు చెప్పారు. తెలంగాణవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామికవేత్తల కోసం పటిష్టమైన అనుకూల వ్యవస్థను పెంపొందిం చడంలో ప్రభుత్వం తిరుగులేని నిబద్ధత ను కనబరుస్తోందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార ఉత్పత్తిదారులు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ రంగం, చెఫ్‌లతో పాటు ఈ రంగంలోని నిష్ణాతులకు ఫుడ్ ఎ ఫెయిర్ ఒక ప్రీమియర్ వేదికగా నిలువనుందని బ్లిట్జ్ నిర్వాహకులు శ్రీకాంత్ పునాటి తెలిపారు. తాజా ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వేదికగా ఈ ట్రేడ్ ఎ ఫెయిర్ ఉప యోగపడుతుందని చెప్పారు.
వందలాది ఎగ్జిబిటర్లు, ఇంటరాక్టివ్ వర్క్‌షాప్‌లు, పరిశ్రమల నిపుణులతో ప్యానెల్ చర్చలు జరు గుతాయని చెప్పారు. మరింత సమాచారం కోసం 70757 71337 నెంబర్‌కు సంప్రదించవచ్చాన్నారు. కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ అఖిల్, డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ జీ మల్సూర్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సీఈవో శ్రీకాంత్, మిల్లెట్ బ్యాంక్ సీఈవో విశాల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.