calender_icon.png 17 January, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలకు రూ.20 వేల కోట్లు

14-07-2024 12:04:15 AM

స్త్రీ సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వ నిర్ణయం

హైదరాబాద్, జూలై ౧౩ (విజయక్రాంతి): మహిళాసంఘాల బలోపేతం దిశగా ప్రభు త్వం అడుగులు వేస్తోంది. గ్రామీణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించేందు కు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగం గా ఈ ఏడాది రూ.20.39 వేల కోట్లను 3,56,273 సంఘాలకు అందజేయాలని నిర్ణయించింది. నిరుడు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద అడ్వాన్స్‌గా రూ.264.34 కోట్లను 2,53,864 సంఘాలకు ఇచ్చింది. రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.2 లక్షల వరకు అప్పు బీమాను కల్పించింది.

ఈ ఆర్థిక సంవత్సరం 3,56,273 సంఘాలకు ఇచ్చే రూ.20 వేల కోట్లకు అదనంగా మరో 2,25,000 మంది మహిళలకు జీవనోపాధి కింద రూ.4,500 కోట్లను బ్యాంకుల నుంచి అందజేయనుంది. స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ స్కూల్ యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను అప్పగించింది. పోలీసు యూనిఫామ్స్  కుట్టే బాధ్యతను వారికే అప్పగించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. పాడి పరిశ్రమల, కోళ్ల ఫామ్‌ల నిర్వహణలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా మరింత ఆర్థిక చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వాటి ఏర్పాటుకు ఎటువంటి పూచీకత్తు లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించనుంది.