calender_icon.png 11 October, 2024 | 5:05 AM

రూ.2 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత

11-10-2024 02:20:48 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: కొన్ని రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. తాజాగా నగరంలోని రమేశ్‌న  గర్‌లో పోలీసులు గురువారం భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. స్పెషల్ సెల్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో 200 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2 వేల కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

వారంరోజులుగా ఢిల్లీ లో సుమారు రూ.7 వేల కోట్ల విలువైన కొకైన్‌ను పట్టుకున్నామని పోలీసులు వెల్లడిం చారు. పక్కా సమాచారంతో జీపీఎస్ ద్వారా డ్రగ్స్ సరఫరాదారున్ని ట్రాక్ చేసి రమేశ్‌నగర్‌లో ఓ వ్యక్తిని పట్టుకున్నామని, స్పాట్‌లో లభించిన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ రాకెట్‌తో సం బంధమున్న మిగిలిన నిందితులు లండన్‌కు పరార్ అయినట్లు తెలిపారు.

ఢిల్లీలో గతవారం 500 కిలోల కొకైన్‌ను పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీ లో చేసిన దాడుల్లో డ్రగ్స్‌కు సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరె స్టు చేశారు. లండన్ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో  పంజాబ్‌లోని అమృత్‌సర్ ఎయిర్‌పోర్టులో జితేంద్రపాల్‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరికి దేశవ్యాప్తంగా పలు గ్యాంగులతో సంబంధముందని తెలిపారు.