calender_icon.png 28 March, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిఫ్ట్ రిజిస్ట్రేషన్‌కు 20 వేల లంచం

21-03-2025 12:00:00 AM

ఏసీబీకి పట్టుబడ్డ స్టేషన్ ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్

జనగామ, మార్చి 20(విజయక్రాంతి): గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు లంచం పుచ్చుకున్న  స్టేషన్‌ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్‌తో పాటు ప్రైవేటు అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకెలితే.. స్టేషన్‌ఘన్‌పూర్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఓ ఇంటికి సంబంధించి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకు న్నాడు. స్టాంపు డ్యూటీలు చెల్లించి సంబంధిత డాక్యుమెంట్లన్నీ సమర్పించాడు.

ఆస్తి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.20 వేలు లంచం ముట్టజెప్పాలని సబ్ రిజిస్ట్రార్ రామకృష్ణ డిమాండ్ చేశారు. తెలివిగా ప్రైవేటు అసిస్టెంట్ ఎదునూరి రమేశ్ ద్వారా గురువారం లంచం తీసుకున్నాడు. లంచం డిమాండ్ చేసినప్పుడే బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

దీంతో ఏసీబీ వరంగల్ డీఎస్‌పీ సాంబయ్య ఆధ్వర్యంలో గురువారం లంచం తీసుకున్న వెంటనే రెడ్ హ్యాండెడ్‌గా కార్యాలయంపై దాడులు నిర్వహించి రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ కాల్స్, కరెన్సీపై ఫింగర్ ప్రింట్ల ఆధారంగా ఇద్దరిని అరెస్టు చేశారు. వారిని ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా లంచం అడిగితే టోల్ ఫ్రీ నంబర్ 106, లేదా 9440446106 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.