01-03-2025 12:00:00 AM
సృజనాత్మకమైన నమూనాలతో వైజ్ఞానిక ప్రదర్శన
మహబూబ్ నగర్ ఫిబ్రవరి 28 (విజయ క్రాంతి) : ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల అటానమస్ నందు వృక్ష శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన సైన్స్ ఎగ్జిబిషను అందర్నీ ఆలోచింపజేసింది. ఈ వైజ్ఞానిక ప్రదర్శనకు ముఖ్య అతిథిగా జిల్లా యువజన క్రీడల అధికారి శ్రీనివాస్ విచ్చేసి ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థినిలు ప్రదర్శనలో ఆక్వాపోనిక్స్, గ్రీన్ హౌస్, ఆహారపు గొలుసు మొదలైనవి వివిధ రకాల నమూనాలను విద్యార్థినిలు ప్రదర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినిలు చక్కటి నమూనాలను ప్రదర్శించారని ఇవి సృజనాత్మకంగా వినూత్నంగా ఉన్నాయని విద్యార్థినిలు ప్రతి విషయాన్ని శాస్త్రీయంగా ఆలోచించాలని శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా ఎదగాలని సూచించారు. అనంతరం కళాశాల వైస్ ప్రిన్సిపల్, వృక్షశాస్త్ర విభాగాధిపతి అమీనా ముంతాజ్ జహాన్ మాట్లాడుతూ విద్యార్థినిలు ప్రదర్శించిన నమూనాలు ఆకర్షణీయంగా వినూత్నంగా ఉన్నాయని , శాస్త్రీయంగా ఆలోచించి అవగాహనను పెంపొందించుకోవాలని విద్యార్థినిలకు తెలిపారు.
చివరగా వైజ్ఞానిక ప్రదర్శనలో వివిధ నమూనాలను ప్రదర్శించిన విద్యార్థినిలకు ప్రథమ ద్వితీయ ,తృతీయ కన్సోలేషన్ బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పద్మ అనురాద, మరియు వృక్షశాస్త్ర విభాగ అధ్యాపకులు డాక్టర్ సుధీర్, డాక్టర్ శ్రీవాణి, డాక్టర్ శ్వేతా రాణి, డాక్టర్ .ఎస్ .త్రివేణి, వి.సుకీర్తి పాల్గొన్నారు.