calender_icon.png 13 March, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అద్దంకి దయాకర్ కి ఎమ్మెల్సీ పదవి దక్కడం హర్షం

12-03-2025 08:12:50 PM

చర్ల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులు డా. అద్దంకి దయాకర్ ను ఎమ్మెల్సీ గా పేరు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ చర్ల  మండల నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పనిచేసిన ఘనత, తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు వ్యవస్థాపకులుగా ప్రఖ్యాతి గడిచిన వ్యక్తిగా, సామాజిక ఉద్యమనేత అందరి బంధువుగా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించి, పార్టీ గెలుపు కోసం తుంగతుర్తి నియోజకవర్గ అసెంబ్లీ సీట్లు కూడా త్యాగం చేసిన, డాక్టర్ అద్దంకి దయాకర్ పేరును కాంగ్రెస్ పార్టీ అదీష్టానం ఎమ్మెల్సీగా  పేరు ఖరారు చేయడం పట్ల చర్ల మండల కాంగ్రెస్ నాయకులు తోటమల్ల వరప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాటానికి నిరంతరం  కృషి చేశారు  కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలుపుకోసం అహర్నిశలు కష్టపడ్డారు , అద్దంకి దయాకర్  ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం అనేది హర్షణీయమని తోటమల్ల వరప్రసాద్ తెలియజేశారు.