calender_icon.png 12 March, 2025 | 11:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అణగారిన వర్గాల బలమైన గొంతు అద్దంకి దయాకర్

12-03-2025 07:29:05 PM

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కృషి మరువలేనిది

జాతీయ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు: తోటమల్ల రమణమూర్తి

కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా అణగారిన వర్గాల సమస్యలపై పోరాడడానికి  బలమైన గొంతు శాసనమండలిలో అడుగుపెట్టనున్నదని జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి(National Mala Mahanadu Bhadradri Kothagudem President Thotamalla Ramanamurthy) అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను ఎస్సీ కోట నుండి ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ పేరును కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం, సోమవారం ఆయన అసెంబ్లీలో నామినేషన్ వేసిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జాతీయ మాల మహానాడు కమిటీ జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అద్దంకి దయాకర్ ను కలిసి అభినందించారు. అనంతరం బుధవారం జిల్లా కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు.

జాతీయ మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు గుడివాడ రాము అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ పేరును ప్రకటించడం అభినందనీయమని అన్నారు. దశాబ్దాలపాటు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కలిగి ఉన్న అద్దంకి దయాకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం మరువలేనిదని అన్నారు. నిరంతరం అణగారిన వర్గాల సమస్యలపై పోరాడి తత్వం కలిగిన అద్దంకి దయాకర్ నియామకం ద్వారా అణగారిన వర్గాల బలమైన గొంతు చట్టసభల్లో అడుగుపెట్టనున్నదనే చర్చ అణగారిన వర్గాల్లో వ్యక్తమవుతున్నదని అన్నారు.కాంగ్రెస్ పార్టీ విధేయతకు మారుపేరుగా నిలిచిన అద్దంకి దయాకర్ ను నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పల్లంటి రమేష్, నాయకులు జెట్టి మోహన్, జంజర్ల కృష్ణ ( జె కే ), మాజీ ఎంపీటీసీ కేడెం రాము, కాటం ఈశ్వరయ్య, బట్టు శ్రీను, గడ్డం కృష్ణ, రామకృష్ణ, గునిగంటి కనకయ్య, వట్టి నారాయణ, బల్లెం జయరాజు, పురుషోత్తం, చుంచుపల్లి మండల అధ్యక్షులు తోకల పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.