calender_icon.png 22 January, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ సభల్లో జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తులు చేసుకోవచ్చు

22-01-2025 08:44:11 PM

రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్...

కామారెడ్డి (విజయక్రాంతి): గ్రామ సభలో జాబితాలో పేర్లు రానివారు దరఖాస్తులు సమర్పించవచ్చని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.విక్టర్ అన్నారు. బుధవారం కామారెడ్డి మండలం షాబ్దిపూర్, సదాశివనగర్ మండలం తిరుమన్ పల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకొని పేరు రానివారు ప్రస్తుతం ఏర్పాటు చేసిన కౌంటర్లో దరఖాస్తులు సమార్పించవచ్చని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అర్హులైన ప్రతీ పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు అదేవిధంగా లబ్ది చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఈ గ్రామ సభల్లో కామారెడ్డి తహసీల్దార్ జనార్ధన్, సదాశివనగర్ తహసీల్దార్ గంగా సాగర్, ఆయా మండలాల ఎంపీడీఓలు, వ్యవసాయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.