భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): క్రమశిక్షణ, నిబద్దలతో పనిచేస్తే కచ్చితంగా తగిన గుర్తింపు వస్తుందని ఎస్పి రోహిత్ రాజ్ అన్నారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసి ఇటీవల రాష్ట్ర డిజిపి గారి చేతుల మీదుగా రివార్డులు అందుకున్న అధికారులను సోమవారం ఆయన అభినందించారు. భద్రాచలం పోలీస్ స్టేషన్లో గంజాయి అక్రమ రవాణా కేసుల్లోని నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన సీఐ నాగరాజు రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుధీర్ లకు ఇటీవల రాష్ట్ర డీజిపి డా.జితేందర్ తమ కార్యాలయంలో రివార్డులను అంద చేసిన విషయం విధితమే.
రివార్డులను అందుకున్న అధికారులను ఎస్పీ రోహిత్ రాజు తమ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. 2023 సంవత్సరంలో ప్రభుత్వం నిషేధిత గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ భద్రాచలం పోలీస్ స్టేషన్లో పట్టుబడిన నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేవిధంగా కృషి చేసిన ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సై శ్రీకాంత్, కోర్టు డ్యూటీ ఆఫీసర్ సుదీర్ లను అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. క్రమశిక్షణ, నిబద్ధతతో పోలిస్ శాఖలో పనిచేసే వారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి మల్లయ్య స్వామి, తదితరులు పాల్గొన్నారు.