తుంగతుర్తి (విజయక్రాంతి): అడ్డగూడూరు మండలం రేపాక గ్రామంలో జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆర్యవైశ్య సంఘం రాజకీయ సంఘం జిల్లా చైర్మన్ తాటికొండ సీతయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం ఎదుట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సీతయ్య మాట్లాడుతూ.. అహింసా సత్యాగ్రహాల ద్వారా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు గాంధీ అని కొనియాడారు. కావాలని గ్రామంలో దుండగులు రాత్రి వేళలో విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని జరిగిన సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిపి శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి ఈగ నాగన్న, కోశాధికారి మాశెట్టి వెంకన్న, మహిళా అధ్యక్షురాలు తల్లాడ సూర్య కళ, తోట సులోచన, ఈగ కవిత, బండారు దయాకర్, బండారు వినయ్, బండారు నాగన్న, తల్లాడ కేదారి, తల్లాడ శ్రీను, తల్లాడ బిక్షం, తల్లాడ శ్రీహరి, గోపారపు సత్యనారాయణ, రాజు శేషన్న తదితరులు పాల్గొన్నారు.